రోగుల బంధువుల ఇక్కట్లు
logo
Published : 18/06/2021 02:58 IST

రోగుల బంధువుల ఇక్కట్లు

ల్గొండ ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో రోగుల బంధువులు అసౌకర్యాలతో ఇక్కట్లు పడుతున్నారు. కొవిడ్‌ విపత్కర పరిస్థితులలో వైద్యశాలలో చికిత్స పొందుతున్న తమ వారి కోసం బంధువులు, తోబుట్టువులు వస్తున్నారు. వారికి అవసరమైనవి అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నారు. అదే సమయంలో అక్కడి అసౌకర్యాల మధ్య రోజులు తరబడి వేచిచూస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఏర్పాటు చేసిన శౌచాలయాలు తాళాలు వేశారు. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ట్యాంకు పాచి పట్టి అపరిశుభ్రంగా ఉంది. నీలువ నీడ లేక చెట్ల కింద సేదతీరుతున్నారు. 

- ఈనాడు, నల్గొండ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని