రైతుల సమస్యలపై పోరాటం: తెదేపా
logo
Published : 18/06/2021 02:58 IST

రైతుల సమస్యలపై పోరాటం: తెదేపా

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయాలని తెదేపా నిర్ణయించింది. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నెల్లూరు దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో గురువారం జూమ్‌ యాప్‌ ద్వారా పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ముఖ్యులతో సమావేశం జరిగింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్యులు, కేంద్ర కమిటీ, పొలిట్‌ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే ప్రమాదం పొంచి ఉందని సమావేశం పేర్కొంది. నకిలీ విత్తనాలకు అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చేయాలని నిర్ణయించింది. రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో సరఫరా చేయాలని కోరింది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైనట్లు సమావేశం పేర్కొంది. లాక్‌డౌన్‌ అనంతరం పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు తుమ్మల మధుసూదన్‌రెడ్డి, విజయ నాయక్‌, మువ్వ అరుణ్‌కుమార్‌, జానకి రాములు, ప్రభాకర్‌, నారాయణ, సూర్యం, కృష్ణయ్య, వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని