కారు అదుపు తప్పి ఒకరు దుర్మరణం
logo
Published : 18/06/2021 02:58 IST

కారు అదుపు తప్పి ఒకరు దుర్మరణం

నేరెడుగొమ్ము, న్యూస్‌టుడే: నేరెడుగొమ్ము మండ లం పలుగుతండ గ్రామపరిధిలోని పెద్దిరాజుబావి గ్రామం వద్ద కారు అదుపు తప్పి ఒకరు మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చందంపేట మండలం బుడ్డోనితండకు చెందిన నేనావత్‌ సేవ్య (25) తన స్నేహితుడు నేనావత్‌ చంద్రు అన్న అంత్యక్రియల సామగ్రి కొనుగోలు చేసేందుకు కారులో పోలెపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. పలుగుతండ గ్రామపంచాయతి పెద్దిరాజుబావి వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడడంతో నేనావత్‌ సేవ్య అక్కడికక్కడే మృతిచెందారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య అమృత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు.
పన్నెండు మందికి గాయాలు...
మాడ్గులపల్లి:  ఇందుగుల గ్రామానికి చెందిన నేతునూరి మురళి తన ఆటోలో ప్రయాణికులను తీసుకొని మిర్యాలగూడకు వెళ్తున్నారు. కుక్కడం వద్దకు రాగానే ఎదరుగా వచ్చే ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఒకదానికొకటి ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇందుగుల గ్రామానికి చెందిన కట్టా చైతన్య, కట్టా లక్ష్మమ్మ, రావులపెంటకు చెందిన సీఎచ్‌ లింగయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్‌, ద్విచక్ర వాహనదారునికి, మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను మిర్యాలగూడకు తరలించారు.
మోత్కూరు: మోత్కూరు మండలం పాటిమట్ల క్రాస్‌రోడ్డు వద్ద గురువారం రాత్రి లారీ ప్రయాణికుల ఆటోను ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారు మోత్కూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని వెళ్లిపోయినట్లు సమాచారం. ఎవరికీ ప్రాణాపాయం లేదని ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని