ఉరేసి.. ప్రాణాలు తీసి భర్తను చంపింది భార్యనే
logo
Published : 18/06/2021 02:58 IST

ఉరేసి.. ప్రాణాలు తీసి భర్తను చంపింది భార్యనే

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: మండలంలోని కందిబండలో ముళ్లగిరి ముత్యాలు అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్‌ చేసినట్టు సీఐ శివరాంరెడ్డి తెలిపారు. మేళ్లచెరువు ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు గురించి వివరించారు. ముత్యాలు భార్య నాగరాణి, ఆమె ప్రియుడు నవీన్‌లను నిందితులుగా పేర్కొంటూ వీరిద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టుకు రిమాండ్‌ చేశామన్నారు. ఈ నెల ఏడో తేదీ రాత్రి మృతి చెందిన ముత్యాలుది సహజ మరణమేనని తొలుత అంతా భావించారు. కానీ.. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నాగరాణి అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని తేల్చారు. నాగరాణి, నవీన్‌ లిద్దరు కలిసి ముత్యాలును హత్య చేసేందుకు మొదట పథకం రచించారు. కానీ.. నాగరాణే ఆ రాత్రి భర్త నిద్రిస్తున్న సమయంలో చున్నీతో మెడకు ఉరివేసి ప్రాణాలు తీసింది. ఈ ఘటనకు పాల్పడబోయే ముందు ప్రియుడు నవీన్‌కు ఫోన్‌ చేసింది. అతడు ఫోన్‌లో స్పందించకపోవడంతో ఆమె ఈ దారుణానికి పాల్పడిందని సీఐ పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగింపులో భాగంగా పట్టుబడిన నిందితులిద్దరిని రిమాండ్‌కు పంపినట్టు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని