‘రోడ్డు నిర్మాణానికి ప్రత్యామ్నాయాలు చూపటం హర్షణీయం’
logo
Published : 18/06/2021 02:58 IST

‘రోడ్డు నిర్మాణానికి ప్రత్యామ్నాయాలు చూపటం హర్షణీయం’

మోతె, న్యూస్‌టుడే: ప్రజోపయోగకరమైన ఒక అభివృద్ధి పనిచేస్తూ మరో అభివృద్ధి పనికి చెరువును చెరిపేయడం మంచిది కాదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్పష్టం చేయడం అమోఘమైందని జలసాధన సమితి జాతీయ అధ్యక్షుడు దుశర్ల సత్యనారాయణ అన్నారు. సూర్యాపేట-ఖమ్మం 365 బీబీ జాతీయ రహదారి నాలుగు వరుసల విస్తరణ పనుల్లో మోతె మండలం రాఘవాపురం ఎక్స్‌రోడ్డు గ్రామ పరిధిలోని చుట్టుగుంట చెరువును పూడ్చి రోడ్డు నిర్మాణం చేస్తున్న విషయాన్ని దుశర్ల ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై ఎన్జీటీ దిల్లీలో బుధవారం విచారణ చేపట్టిన సందర్భంగా ఆయన గురువారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. ఫిర్యాదుపై స్పందించిన ఎన్జీటీ నిపుణుల కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరి 11న చెరువును పరిశీలించి.. జిల్లా అధికారుల నుంచి వివరణ తీసుకున్నట్లు చెప్పారు. బుధవారం దీనిపై దిల్లీలో ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల పేరుతో చెరువుల పూడ్చివేతకు తాము వ్యతిరేకమని ఎన్జీటీ తరపున ధర్మాసనం అభిప్రాయం వెలిబుచ్చిందన్నారు. చెరువు ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి పలు ప్రత్యామ్నాయాలను సూచించిడం హర్షణీయం అన్నారు. ఇప్పటి వరకు రహదారి విస్తరణ పనులకోసం చెరువును పూడ్చి నాశనం చేసినట్లయితే దానిని పునరుద్ధరించాలని పేర్కొనడం మంచి పరిణామమన్నారు. దీనిపై ఈనెల 27న నిర్వహించనున్న విచారణలో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఒక నీటివనరు శాశ్వతంగా బతికి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని