యాదాద్రిలో వసతుల కల్పనకు కృషి
eenadu telugu news
Published : 27/07/2021 04:05 IST

యాదాద్రిలో వసతుల కల్పనకు కృషి


కొండ కింద వైకుంఠ ద్వారం చెంత రక్షణగోడ నిర్మాణం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రిలో మున్ముందు అవసరమయ్యే వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. యాడా ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొండపై ఫైర్‌ సంప్‌ నిర్మిస్తోంది. అగ్నిప్రమాదం సంభివిస్తే ఆర్పడానికి ప్రత్యేక కేంద్రంతో పాటు నీటి సంప్‌ నిర్మాణానికి పనులను చేపట్టారు. ఆ క్రమంలో కొండపై బండ రాతిని తొలగిస్తున్నట్లు ఈఈ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. పంచనారసింహుల ఆలయ సన్నిధిలో ఫ్లోరింగ్‌, గ్రీనరీ పెంపకం పనులు కొనసాగుతున్నాయి. కొండ కింద వైకుంఠ ద్వారం వద్ద రక్షణగోడ నిర్మాణానికి తగు పనులను వేగవంతం చేశారు. ప్రసాదాల తయారీకి గ్యాస్‌ సరఫరా చేసే ప్లాంట్‌ కోసం రక్షణగోడ నిర్మిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రాచీన కళలతో వైకుంఠ ద్వారం రూపొందుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని