ప్రతిపక్షాల విమర్శలే వారి కొంపముంచుతాయి: గుత్తా
eenadu telugu news
Published : 27/07/2021 04:05 IST

ప్రతిపక్షాల విమర్శలే వారి కొంపముంచుతాయి: గుత్తా


దేవరకొండలో మాట్లాడుతున్న శాసన మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

దేవరకొండ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక భాజపా, కాంగ్రెస్‌ పార్టీల వారు చేస్తున్న విమర్శలే వారి కొంపముంచుతాయని శాసన మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం దేవరకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు గొప్ప పథకమని, దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. పథకాల్లో ఏమైనా అవకతవకలు జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తప్ప అనవసర విమర్శలు చేయవద్దన్నారు. దళితుల మూడెకరాల చొప్పున భూ పంపిణీ నిరంతర ప్రక్రియ అని వివరించారు. సమావేశంలో పురపాలిక సంఘం ఛైర్మన్‌ ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్‌యాదవ్‌, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని