పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
eenadu telugu news
Published : 27/07/2021 04:20 IST

పాత కక్షలతో యువకుడి దారుణ హత్య


సల్వాది జానయ్య

మఠంపల్లి, న్యూస్‌టుడే: భూవివాదాల నేపథ్యంలో యువకుడు హత్యకు గురైన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో సోమవారం చోటుచేసుకుంది. సీఐ రామలింగారెడ్డి, ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. సల్వాది జానయ్య (37)కు బంధువైన శ్రీపతి వెంకటేశ్వర్లుకు కొంత కాలంగా భూవివాదం కొనసాగుతుంది. గతంలో పలుమార్లు ఘర్షణలు జరిగి ఠాణాలో ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వెంకటేశ్వర్లు మరో ముగ్గురితో కలిసి ఉదయం పశువులను తోలుకుని పొలానికి వెళుతున్న జానయ్యపై దారికాచి మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. తీవ్రగాయాలై అపస్మారక స్థితిలో ఉన్న జానయ్యను హుజూర్‌నగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యోదంతంపై విచారణ నిర్వహించారు. మరణోత్తర పరీక్షలు నిర్వహించాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితులు వెంకటేశ్వర్లు, శివపార్వతమ్మ, అనిత, ఎస్‌.జానయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని