ఘనంగా కార్గిల్‌ దివస్‌
eenadu telugu news
Published : 27/07/2021 05:30 IST

ఘనంగా కార్గిల్‌ దివస్‌


నల్గొండ:అమరవీరుల చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మాజీ సైనిక సంఘం నాయకులు

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల ఆత్మలకు శాంతి కలగాలని మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంది పాపిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్గిల్‌ దివస్‌లో పాల్గొని అమరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఆ సైనికుల కుటుంబ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో సంక్షేమ సంఘం నాయకులు కత్తి భాస్కర్‌రెడ్డి, కేశవులు, ఇంద్రయ్య, సత్యనారాయణరెడ్డి, బొమ్మరబోయిన కేశవులు, లయన్స్‌క్లబ్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నకిరేకల్‌: కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ కార్యక్రమాన్ని నకిరేకల్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. మాజీ సైనికులు దొంత రామనర్సయ్య, కొమ్ము కోటేశ్‌యాదవ్‌, చౌగోని లక్ష్మణ్‌గౌడ్‌లను టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌, కౌన్సిలర్లు గాజుల సుకన్య, దైద స్వప్న సన్మానించారు. నాయకులు గార్లపాటి రవీందర్‌రెడ్డి, వెంకన్న, యూసూఫ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని