చీకట్లు దూరం
eenadu telugu news
Published : 27/07/2021 05:30 IST

చీకట్లు దూరం


పద్మశాలీ కాలనీలో వీధి లైట్ల విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది

నాంపల్లి, న్యూస్‌టుడే: నాంపల్లి మండలకేంద్రంలోని పద్మశాలీ కాలనీలో వారం రోజులుగా వీధి లైట్లు వెలగడం లేదు. అసలే వర్షాకాలం కావడంతో రాత్రి పూట బయటకు రావాలంటే కాలనీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ విషయమై సోమవారం ‘ఈనాడు’లో ‘అంధకారంలో పద్మశాలీ కాలనీ’ శీర్షిక ప్రచురితమైన కథనానికి సర్పంచి కుంభం విజయ, కార్యదర్శి ఎండీ.సత్తార్‌ స్పందించారు. పంచాయతీ సిబ్బంది సహకారంతో విద్యుత్తు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి వీధిలైట్లను సరిచేయించారు. మంగళవారం వరకు పూర్తిస్థాయిలో లైట్లు వెలిగేలా చర్యలు చేపడుతున్నామని కార్యదర్శి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని