Published : 27/07/2021 05:30 IST

దివ్యదిశతో విద్యాబోధన


గూగుల్‌మీట్‌ ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: కరోన నేపథ్యంలో ప్రత్యేక అవసరాల పిల్లలకు దివ్యదిశ ద్వార బోధన కొనసాగిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అన్నారు. సోమవారం ఆమె గూగుల్‌మీట్‌ ద్వారా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. కరోనా కారణంగా దృష్టిలోపం, చెవిటి, మూగ, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు విద్యకు దూరం కావొద్దన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా వలిగొండ, భువనగిరి, రామన్నపేట మండలాల్లో విద్యాబోధన కొనసాగిస్తామని అన్నారు. సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఏఎంవో శ్రీనివాస్‌, ఐఈ కోఆర్డినేటర్‌ జోసఫ్‌, మండల విద్యాశాఖాధికారులు రంగరాజన్‌, కిరణ్‌కుమార్‌, ఎస్తేరు రాణి, జంగమ్మ, సత్యమ్మ, సుజాత, కమల, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రాజపేట: పారుపల్లి ఉన్నత పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న రావుల శ్రీవిద్యకు ఇదే పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు పి.రాంప్రసాద్‌ ఆధునిక చరవాణీ అందించేందుకు ముందుకువచ్చాడు. ప్రధానోపాధ్యాయుడు బుస్సా రమేశ్‌తో కలిసి సోమవారం భువనగిరిలో డీఈవో చైతన్యజైని చేతులమీదుగా చరవాణి అందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని