కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ
eenadu telugu news
Published : 27/07/2021 05:30 IST

కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ


చిన్నకొండూరులో పల్లె పకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్‌ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రజావాణిలో బాధితుల నుంచి వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాలను సోమవారం స్వీకరించారు. అనంతరం అధికారుల సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను తీర్చాలని పేర్కొన్నారు. మండల స్థాయి అధికారుల చుట్టూ తిరిగి వేసారి ప్రజావాణికి వస్తారని, వారి సమస్యలను తీర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా 53 వినతులు అందినట్లు అధికారులు చెప్పారు. ఇందులో భూ సమస్యలు, ఆసరా పింఛన్లు తదితర సమస్యలున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని