‘యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం’
eenadu telugu news
Published : 27/07/2021 05:35 IST

‘యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు విఫలం’


రామన్నపేటలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి

రామన్నపేట, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. రామన్నపేటలో సోమవారం నిర్వహించిన డీవైఎఫ్‌ఐ జిల్లా మహాసభల సందర్భంగా నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన మహాసభలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో తరచూ ఉద్యోగాల నియామక ప్రకటనలతో నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. యువత, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కోరారు. నిరుద్యోగుల సమస్యలపై శాసనమండలిలో ప్రస్తావిస్తానని చెప్పారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు మందుల విప్లవ్‌కుమార్‌ మాట్లాడుతూ 2 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకుండా లక్షలాది మంది ఉద్యోగాలు తొలగించిందని విమర్శించారు. ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్లాపురం వెంకటేశం సంఘం జెండాను ఆవిష్కరించారు. నర్సింహరావు, కల్లూరి మల్లేశం, ఎ.వెంకటేశం, బొడ్డుపల్లి వెంకటేశం, మేక అశోక్‌రెడ్డి, జల్లెల పెంటయ్య, నాగటి ఉపేందర్‌, బుగ్గ నవీన్‌, కూరెళ్ల నర్సింహచారి, పల్లె మధు, కృష్ణ, వెంకటేశం పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని