పేదల అభ్యున్నతే ధ్యేయం: ఎమ్మెల్యే పైళ్ల
eenadu telugu news
Published : 27/07/2021 05:35 IST

పేదల అభ్యున్నతే ధ్యేయం: ఎమ్మెల్యే పైళ్ల


భువనగిరి: ఆహార భద్రత కార్డులను అందజేస్తున్న ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి, తదితరులు

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో ఎమ్మెల్సీ కృష్ణారెడ్డితో కలిసి సోమవారం ఆహార భద్రత కార్డులను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పుర ఛైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయలు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, పౌరసరఫరాల జిల్లా అధికారి బ్రహ్మరావు, ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ సభ్యుడు బీరుమల్లయ్య పాల్గొన్నారు.

బీబీనగర్‌: మండల కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అంతర్గత మురికికాలువలు, సీ సీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీపీ యరకాల సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత, సర్పంచి మల్లగారి భాగ్యలక్ష్మి, బొక్క జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని