Published : 27/07/2021 05:38 IST

నీటి ట్యాంకర్‌ బోల్తా.. వ్యక్తి మృతి


నర్సింహ

ఆత్మకూరు(ఎం), న్యూస్‌టుడే: నీటి ట్యాంకర్‌ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆత్మకూరు(ఎం) మండలం కప్రాయిపల్లిలో సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్రాయిపల్లికి చెందిన కొంగరి నర్సింహ(39) మేస్త్రీగా జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య సంతోష వార్డు సభ్యురాలిగా ఉంది. వారికి కుమార్తె, కుమరుడు ఉన్నారు. సోమవారం వరుసకు పెద్దనాన్న అయిన కొంగరి నర్సయ్య దశదిన కర్మ ఉండటంతో నర్సింహ గ్రామంలో వ్యవసాయ బావుల దగ్గరి నుంచి పంచాయతీ ట్యాంకర్‌ (ట్రాక్టర్‌ ఇంజిన్‌ వేరొకరిది) ద్వారా నీరు తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో ట్యాంకర్‌ చక్రం గుంతలో పడి పల్టీ కొట్టింది. బయటకు తీసే ప్రయత్నం చేయగా ట్రాక్టర్‌ ఇంజిన్‌ కూడా పల్టీ కొట్టింది. ఇంజిన్‌ కింద పడటంతో నర్సింహకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని చికిత్స కోసం మోత్కూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని భువనగిరి ఆసుపత్రికి తరలించామని ఎస్సై జి.మధు తెలిపారు.


బోల్తా పడిన ట్యాంకర్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని