మరమ్మతులు చేయించటంలో ప్రజాప్రతినిధులు విఫలం
eenadu telugu news
Published : 02/08/2021 03:04 IST

మరమ్మతులు చేయించటంలో ప్రజాప్రతినిధులు విఫలం

పిలాయిపల్లి గ్రామంలో దీక్ష శిబిరంలో కూర్చున్న రైతులు

భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌టుడే: పిలాయిపల్లి కాల్వకు మరమ్మతులు చేయించటంలో ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని, వెంటనే పూర్తిచేయించాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన దీక్ష ఆదివారం మూడో రోజు కొనసాగింది. సకాలంలో మరమ్మతులు చేయకుండా కొన్ని ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం అన్యాయమని వారు తెలిపారు. దీక్షాశిబిరంలో కళ్లెం రాఘవరెడ్డి, సతీష్‌చారి, దానయ్య, నర్సింహ, శేఖర్‌, ఆనందం, శ్రీను, అశోక్‌, ప్రభాకర్‌, శంకరయ్య కూర్చున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని