హింస, అసమానతలపై పోరాడాలి
eenadu telugu news
Published : 02/08/2021 03:04 IST

హింస, అసమానతలపై పోరాడాలి

చౌటుప్పల్‌లో మాట్లాడుతున్న ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: మహిళలపై పెరుగుతున్న హింస, అసమానతలపై పోరాడాలని ‘ఐద్వా’ జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ కోరారు. చౌటుప్పల్‌లోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘ఐద్వా’ పట్టణ మహాసభలో మాట్లాడారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ధరలను పెంచుతుందని విమర్శించారు. మహిళల పోరాట ఫలితంగానే గృహ హింస, నిర్భయ, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు అమలవుతున్నాయని తెలిపారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు దోనూరు నిర్మల ప్రసంగించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా అర్షియాబేగం, ఉపాధ్యక్షులుగా బత్తుల జయమ్మ, గోశిక సుమతి, ప్రధాన కార్యదర్శిగా అవ్వారు రామేశ్వరి, సహాయ కార్యదర్శులుగా దండ హిమబిందు, బత్తుల లత, కోశాధికారిగా దొడ్డి అండాలు ఎన్నికయ్యారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని