విద్యుదాఘాతంతో రైతు మృతి
eenadu telugu news
Published : 02/08/2021 03:04 IST

విద్యుదాఘాతంతో రైతు మృతి

మోతె, న్యూస్‌టుడే: పొలం వద్దకు వెళుతూ విద్యుదాఘాతానికి గురై రైతు మృతి చెందిన ఘటన మోతె మండలం నామవరంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కీసర ప్రశాంత్‌రెడ్డి(45) తన సొంత పొలం వద్దకు వెళుతుండగా కాలుజారి పడబోయి పక్కనే ఉన్న ఫెన్సింగ్‌ తీగెలను పట్టుకున్నారు. ఆ ప్రదేశంలో రైతు ఒకరు తన వ్యవసాయ విద్యుత్తు మోటారుకు అవసరమైన తీగలకు ఆధారంగా కట్టిన ఫెన్సింగ్‌ ఇనుప తీగెలకు విద్యుత్తు ప్రసారం అయింది. అదే ఫెన్సింగ్‌ తీగలను పట్టుకున్న ప్రశాంత్‌రెడ్డి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతిచెందారు. కాపాడేందుకు ప్రయత్నించిన సీమ రవికి కూడా తీగెలను తాకడంతో షాక్‌ కొట్టింది. సమీపంలో ఉన్న సర్పంచి భర్త మల్సూర్‌ అప్రమత్తమై విద్యుత్తు నియంత్రికను నిలిపేశారు. అప్పటికే రైతు మృతిచెందారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని