మట్టపల్లిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం
eenadu telugu news
Published : 02/08/2021 03:04 IST

మట్టపల్లిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవం

మట్టపల్లి శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్న పురోహితులు

మఠంపల్లి, న్యూస్‌టుడే: మట్టపల్లి క్షేత్రంలోని శివాలయంలో శ్రీవల్లీ, దేవసేనాని సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఆదివారం శాస్రోక్తంగా నిర్వహించారు. ఈశ్వరుడికి ఉదయం రుద్రాభిషేకం, పంచాయతన, షోడశోప పూజలు జరిగాయి. అష్టోత్తర నామార్చనలు, నవగ్రహారాధనల అనంతరం కల్యాణ మూర్తులను పరిణయ వేదికపైకి వేంచేయించి మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం తదుపరి రక్షాధారణలు కావించారు. స్వామివారికి యజ్ఞోప వీతధారణ, పాదప్రక్షాళనం, మదుఫర్క పూజలు జరిగాయి. పరిణయోత్సవ క్రతువు ప్రాంభమయ్యాక కన్యాదానం, జీరగుణ, మాంగల్యధారణలు జరిగాక అక్షతారోపణం, బ్రహ్మగ్రంధితో కల్యాణోత్సవం పరిసమాప్తమైంది.ఆలయ ఛైర్మన్‌ చెన్నూరు విజయ్‌కుమార్‌, ఈవో ఎస్‌.నవీన్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని