టెయిల్‌పాండ్‌ నుంచి 18 క్రస్ట్‌ గేట్ల ద్వారా..
eenadu telugu news
Published : 02/08/2021 03:16 IST

టెయిల్‌పాండ్‌ నుంచి 18 క్రస్ట్‌ గేట్ల ద్వారా..

టెయిల్‌పాండ్‌ నుంచి దిగువకు కొనసాగుతున్న నీటి విడుదల

అడవిదేవులపల్లి, న్యూస్‌టుడే: అడవిదేవులపల్లి శివారులోని కృష్ణానదిపై నిర్మించిన టెయిల్‌పాండ్‌ ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు సాగర్‌ నుంచి 31,290 క్యూసెక్కుల నీరు టెయిల్‌పాండ్‌కు వచ్చి చేరింది. సాగర్‌ జలాశయం నుంచి 14 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలిన నేపథ్యంలో టెయిల్‌పాండ్‌ 18 క్రస్ట్‌ గేట్లను 1.67 మీటర్లు పైకి ఎత్తి 1,78,995 క్యూసెక్కుల నీటిని, రెండు పవర్‌ గేట్ల ద్వారా 7,180 క్యూసెక్కులు మొత్తం 1,86,175 క్యూసెక్కుల నీటిని దిగవనున్న పులిచింతలకు వదులుతున్నారు. టెయిల్‌పాండ్‌ నీటి నిల్వ సామర్థ్యం 7.080 టీఎంసీలు(75.500 మీటర్లు) కాగా ప్రస్తుతం 6.840 టీఎంసీల (75.150 మీటర్ల) నీరు నిలువ ఉన్నట్లు ఏఈ కె.ఎల్‌. నర్సింహారావు తెలిపారు. కృష్ణా నదిలోకి చేపలు పట్టేందుకు జాలరులు, పరిసర గ్రామాల ప్రజలకు వెళ్లవద్దని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని