హామీలు నెరవేర్చాలి: భాజపా
eenadu telugu news
Updated : 02/08/2021 04:18 IST

హామీలు నెరవేర్చాలి: భాజపా

నెల్లికల్‌ లిఫ్ట్‌ శంకుస్థాపన స్థలం వద్ద నిరసన తెలుపుతున్న భాజపా జిల్లా
అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, తదితరులు

పెద్దవూర (రూరల్‌), తిరుమలగిరి (సాగర్‌), న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని భాజపా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్ఢి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన పార్టీ నాయకులతో కలిసి తిరుమలగిరి (సాగర్‌) మండలంలో సీఎం శంకుస్థాపన చేసిన నెల్లికల్‌ లిఫ్ట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెద్దవూరలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2018లో కుర్చీ వేసుకొని నెల్లికల్‌ లిఫ్ట్‌ను పూర్తిచేస్తానని హామీ ఇచ్చి, 2021లో తిరిగి ప్రత్యక్షమై లిఫ్ట్‌ పనులకు శంకుస్థాపన చేసి ఇప్పటి వరకూ పనులు ప్రారంభించలేదని విమర్శించారు. హుజారాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో సమీక్ష సమావేశం పేరుతో ప్రజలను మరోసారి ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారన్నారు. మున్సిపాలిటీలకు, గ్రామాలకు నిధులు, గిరిజన పోడు భూముల సమస్యల పరిష్కారాలు నేటికీ లేవన్నారు. నాగార్జునసాగర్‌లో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని, ఆ తర్వాతే సాగర్‌లో సీఎం అడుగు పెట్టాలన్నారు. భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల రాజశేఖర్‌రెడ్డి, ములుగు మహిళా మోర్చ ఇన్‌ఛార్జి కంకణాల నివేదితారెడ్డి, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భవాని ప్రసాద్‌, వేదాంత గోపినాథ్‌, శంకర్‌నాయక్‌, ఏరుకొండ నర్సింహ, యాదగిరి, పొనుగోటి హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని