లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు
eenadu telugu news
Updated : 02/08/2021 12:27 IST

లారీని ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలివినేడు శివారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ బస్సు.. ముందు వెళ్తున్న గుర్తు తెలియని లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సహా అందులో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని