జీవన్మృతుని అవయవ దానానికి సిద్ధం
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

జీవన్మృతుని అవయవ దానానికి సిద్ధం

రేసు బుగ్గరాంరెడ్డి

మోత్కూరు, న్యూస్‌టుడే: మోత్కూరు మండలం ముశిపట్లకి చెందిన రైతు, వన సేవకుడు రేసు బుగ్గ రాంరెడ్డి (60) రహదారి ప్రమాదానికి గురై శనివారం సాయం త్రం జీవన్మృతుని (బ్రెయిన్‌డెత్‌)గా మారడంతో అవయవాలన్నీ దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందు కొచ్చారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గరాంరెడ్డి నాలుగు రోజుల క్రితం ద్విచక్రవాహనంపై వెళుతుండగా తన గ్రామ సమీపంలో ఎదురుగా మరొకరువచ్చి ఢీ కొనడంతో గాయాల పాలయ్యారు. ఆయనను ఈనెల 15న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బుగ్గరాంరెడ్డికి బ్రెయిన్‌డెత్‌ అయ్యి జీవన్‌ మృతునిగా మారాడని యశోదా ఆసుపత్రి న్యూరోసర్జన్‌ డాక్టర్‌ ఆనంద్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆ వైద్యుడు కుటుంబ సభ్యులతో చర్చించి జీవన్‌ధాన్‌ సంస్థకు అవయవదానం చేసేం దుకు ఒప్పించారని వారు పేర్కొన్నారు. బుగ్గరాంరెడ్డికి భార్య అండమ్మ, నలుగురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు కాగా కొడుకు పోలీస్‌ కానిస్టేబుల్‌గా హైదరాబాద్‌ ఉప్పల్‌లో పనిచేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని