పర్యావరణ హితం.. ఆర్థికాభివృద్ధికి ఊతం
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

పర్యావరణ హితం.. ఆర్థికాభివృద్ధికి ఊతం

హుజూర్‌నగర్‌, న్యూస్‌టుడే

సేంద్రియ ఎరువును పరిశీలిస్తున్న కమిషనర్‌ నరేష్‌రెడ్డి, ఇతర అధికారులు

కుªట్లు.. అల్లికలే కాదు సేంద్రియ ఎరువు తయారు చేయగలమని హుజూర్‌నగర్‌ స్వయం సహాయ మహిళలు నిరూపించారు. ప్రస్తుతం మార్కెట్‌లో సేంద్రియ ఎరువులకు డిమాండ్‌ ఉంది. దీంతో ఉచిత వనరులతో ఎరువు తయారు చేసి అమ్ముతూ ఆదాయాన్ని పొందుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తూ జిల్లాకే ఆదర్శంగా ఉన్నారు. వీరి కృషిని తెలుసుకున్న కేంద్రం వీరికి స్వచ్ఛతా సారథి ఉపకార వేతనం ఏడాది పాటు అందించారు. హుజూర్‌నగర్‌కు చెందిన ముగ్గురు మూడేళ్లుగా తమ కేంద్రాన్ని నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఏటా దీని ద్వారా రూ. 80 వేల ఆదాయ పొందుతూ కంచర్ల వెంకట రమణ, చిట్యాల ఆదిలక్ష్మి, రాయల లక్ష్మి అందరికి ఆదర్శంగా నిలిచారు.

2019 నుంచి హుజుర్‌నగర్‌లో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. వీరి కేంద్రంలో నాలుగు షెడ్డులు ఏర్పాటు చేసి సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. సంవత్సరానికి 10 నెలల్లో అయిదు పంటలు తీస్తారు. సంవత్సరంలో 16 క్వింటాళ్ల సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఒక కిలో రూ. 10కు అమ్ముతున్నారు. రూ. 10 వేల ఖర్చులు పోనూ రూ. 70 వేల ఆదాయం వస్తోంది. రోజు ఒక గంట మాత్రమే పనిచేస్తారు. పంట వచ్చిన సమయంలో ఎక్కువ పని ఉంటుంది. నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుంచి ఈ ఎరువును కొనుగోలు చేస్తున్నారు. ఇంటి పెరటిలో తోటలు, మిద్దెతోలల పెంపకం చేసేవారు, కుండీలలో మొక్కలను పెంచేవారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఈ సేంద్రియ ఎరువును కొనుగోలు చేసుకుంటున్నారు.


అనేక ప్రాంతాల నుంచి వచ్చి కొనుక్కుంటున్నారు

మా సేంద్రియ ఎరువును కొనుక్కొనేందుకు అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రతిఒక్కరూ తమ పెరటిలో, మిద్దెతోటలలో మొక్కలు ఏపుగా పెరిగేందుకు వాడుకోవచ్ఛు అధికారులు, ప్రజలు బాగా సహకరిస్తున్నారు. తడి చెత్తను వేరు చేసి అందించి మరింత ప్రోత్సాహం అందించాలి.


పర్యావరణం పరిరక్షించుకోవచ్చు

- రాజశేఖర్‌, పర్యావరణ, ఇంజినీర్‌, పురపాలక సంఘం, హుజూర్‌నగర్‌

మహిళలు సేంద్రియ ఎరువు తయారు చేసేందుకు ముందుకు రావాలి. ప్లాస్టిక్‌ నివారణ కూడా సులభమవుతుంది. మహిళలు ఇంటి వద్దనే సొంతగా ఎరువు తయారు చేసుకునేలా అవగాహన పెంచుకోవాలి. అలా చేస్తే ఇంటికి అవసరమైన సేంద్రియ ఎరువు ఇంట్లోనే తయారు అవుతుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని