తెరుచుకున్న రేషన్‌ దుకాణం
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

తెరుచుకున్న రేషన్‌ దుకాణం

119 మంది లబ్ధిదారులకు బియ్యం అందజేత

సోమ్లాతండా రేషన్‌ దుకాణంలో ఇన్‌ఛార్జి డీలర్‌తో లబ్ధిదారులకు

సరకులు అందిస్తున్న డీటీసీఎస్‌ విజయ్‌కుమార్‌

నూతనకల్‌, న్యూస్‌టుడే: నూతన్‌కల్‌ మండలంలోని సోమ్లా తండా రేషన్‌ దుకాణం తెరుచుకోక గిరిజనులకు ఉచిత చౌక బియ్యం అందకపోవడంపై ‘ఈనాడు’లో శనివారం ప్రచురితమైన ‘గిరిజనుల పరేషాన్‌’ కథనానికి పౌర సరఫరా, రెవెన్యూ అధికారులు స్పందించారు. గతంలో ఇన్‌ఛార్జి విధులు నిర్వహించిన చిల్పకుంట్ల రేషన్‌ డీలర్‌ను సరకుల పంపిణీకి ఒప్పించి శనివారం గ్రామానికి చేరుకుని రేషన్‌ దుకాణం తెరిపించి గిరిజనులకు ఉచిత బియ్యం పంపిణీ చేశారు. 119 ఆహార భద్రత కార్డులకు 36.27 క్వింటాళ్ల బియ్యం అందించామని రెండ్రోజుల్లో లబ్ధిదారులందరికీ బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు. కార్యక్రమంలో తుంగతుర్తి డివిజన్‌ సివిల్‌ సప్లయ్‌ అధికారి విజయ్‌కుమార్‌, సివిల్‌ సప్లయ్‌, రెవెన్యూ ఆర్‌ఐలు అసన్‌ అహ్మద్‌, సుజిత్‌ కుమార్‌, ఇన్‌ఛార్జి రేషన్‌ డీలర్‌ మమత, సర్పంచి గుగులోతు శంకర్‌నాయక్‌, రవీందర్‌ నాయక్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని