పట్టణ రహదారి కుదింపు
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

పట్టణ రహదారి కుదింపు

రహదారి నిర్మాణానికి పోసిన కాంక్రీటు తొలగిస్తున్న దృశ్యం

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: యాదగిరిగుట్ట పట్టణంలో చేపడుతున్న వంతెన రహదారి నిర్మాణాన్ని కుదించారు. ఇటీవల పాతగుట్ట చౌరస్తా వరకు నిర్మాణం తలపెట్టగా, స్థానికులు, నాయకులు, వ్యాపారులు నిరసన ద్వారా అభ్యంతరం తెలిపిన విషయం విదితమే. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత చొరవ తీసుకొని ఈఎన్‌సీ రవీందర్‌రావుతో చర్చించి వంతెన పొడవు తగ్గించేలా చర్యలు తీసుకున్నారని పుర అధ్యక్షురాలు సుధ శనివారం విలేకరులకు తెలిపారు. వైకుంఠ ద్వారం నుంచి లక్ష్మీ టాకీస్‌ వరకు మాత్రమే వంతెన ఉంటుందని చెప్పారు. అధికారుల నుంచి ఆదేశాలు రావడంతో పాతగుట్ట చౌరస్తా వరకు రహదారి నిర్మాణానికి వేసిన కాంక్రీటును తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. ప్రణాళిక లేకుండా పనులు చేయడం, ప్రజలు ముందే అభ్యంతరం చెప్పకపోవడంతో వేసిన కాంక్రీటు, నిర్మించిన రక్షణ గోడ తొలగించడం వల్ల ప్రజాధనం వృథాపాలైందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని