ప్రత్యేక ఓటరు జాబితా సవరించండి
eenadu telugu news
Published : 19/09/2021 02:09 IST

ప్రత్యేక ఓటరు జాబితా సవరించండి

దూరదృశ్య శ్రవణ మాధ్యమ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్‌ పమేలా సత్పతి,

అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు

భువనగిరి, న్యూస్‌టుడే: వచ్చే సంవత్సర తుది ప్రచురణార్థం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ కోరారు. జిల్లా కలెక్టర్లతో శనివారం ఆయన దూరదృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌-2022 ఓటరు జాబితా సవరణ, ముసాయిదా సవరణ, ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గరుడ యాప్‌లో బూత్‌లెవల్‌ అధికారుల ద్వారా పోలింగ్‌ కేంద్రాల వివరాల నమోదు, 1500 ఓటర్ల కంటే ఎక్కువ ఉన్న చోట అదనపు పోలింగ్‌కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామన్‌ సర్వీస్‌ సెంటర్ల ద్వారా ఓటరు ఎపిక్‌కార్డులు పొందేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. 1 జనవరి 2022 నాటికి 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరూ ఓటుహక్కు పొందేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమీక్షలో కలెక్టర్‌ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉపేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.

భువనగిరి, న్యూస్‌టుడే: జిల్లాలో కొవిడ్‌ టీకా పంపిణీ కార్యక్రమం మరింత వేగవంతంగా జరగాల్సిన అవసరం ఉందని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్‌లోని తన కార్యాలయం నుంచి శనివారం జిల్లాలో జరుగుతున్న వాక్సినేషన్‌పై గూగుల్‌ మీట్‌ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. మూడు రోజులుగా 30వేల మందికి టీకా ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు 23 వేల మంది చొప్పున టీకా ఇవ్వాలని సూచించారు. అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సాంబశివరావు గూగుల్‌ మీట్‌లో పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని