యాదాద్రిలో అధునాతన బస్‌బే
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

యాదాద్రిలో అధునాతన బస్‌బే


కొండపై దక్షిణ దిశలో చదును పనులు 

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో యాత్రికుల రవాణా కోసం ప్రత్యేక బస్‌బే ఏర్పాటుకు కొండపైన కేటాయించిన ఏకరంన్నర స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. భక్తుల రాక,పోకల కోసం ఆలయ సన్నిధిలో అధునాతనంగా నిర్మించనున్న బస్‌బే మందిరం రూపంలో రూపొందనుంది. ఇందుకు కొండపైన దక్షిణ దిశలో గల బండ రాళ్లను తొలగించి ఎదరుగా రక్షణగోడ నిర్మించి చదును చేస్తున్నారు. కొండపైకి, కిందికి వచ్చిపోయే మినీ బస్సుల కోసం 16 ఫ్లాట్‌ఫారాలు ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా యాడా ఈ పనులు చేపడుతోందని ఆర్‌అండ్‌బీ శాఖ ఎస్‌ఈ వసంతనాయక్‌, ఈఈ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

పసిడి వర్ణంలో స్తంభాలు..

రోజుకోరకం వనరులు.. సరికొత్త ఏర్పాట్లతో యాదాద్రి క్షేత్రాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గోపురాలకు విద్యుత్తు కాంతులు విరజిమ్మేలా ఫోకస్‌ లైట్ల కోసం వాటికి ఎదురుగా పసిడి వర్ణంతో కూడిన స్తంభాలకు మరిన్నీహంగులు కల్పిస్తున్నారు.


నడక యాతన

యాదగిరిగుట్ట: యాదాద్రి పంచనారసింహుల క్షేత్ర సందర్శనకు వచ్చే యాత్రికులను ఆలయ దారి తిప్పలు పెడుతోంది. క్షేత్రాభివృద్ధి పనులు కొనసాగుతున్నందున బాలాలయానికి వచ్చి, పోయేందుకు ఒక దారే ఉంది. అదీ ఇరుకిరుకుగా రాళ్లతో ఉండటంతో ఆదివారం భక్తులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని