రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


కంకణాల వినీత్‌రెడ్డి

చింతపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్‌-నాగార్జునసాగర్‌ హైవే రహదారిపై చింతపల్లి మండలం పోలేపల్లిరాంనగర్‌ గేట్‌ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. చింతపల్లి మండలంలోని వెంకటేశ్వరనగర్‌కు చెందిన ఆలంపల్లి రాములు - సువర్ణ దంపతుల కుమారుడు అరవింద్‌(27), రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన పరిపూర్ణనందచారి ఇద్దరు స్నేహితులు. ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై వెంకటేశ్వరనగర్‌ నుంచి మాడ్గుల మండలానికి వెళ్తుండగా మార్గమధ్యలో పోలేపల్లిరాంనగర్‌ గేట్‌ సమీపంలోకి రాగానే హైదరాబాద్‌ వైపు వెళ్తున్న క్వాలీస్‌ వాహనం బలంగా ఢీకొట్టింది. ఘటనలో అరవింద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. పరిపూర్ణనందచారికి తీవ్రగాయాలు కావడంతో మాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అరవింద్‌కు భార్య, ఆరు నెలల కుమార్తె ఉంది. హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని