జాతీయ రహదారిపై సిమెంట్‌ లారీ దగ్ధం
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

జాతీయ రహదారిపై సిమెంట్‌ లారీ దగ్ధం


ఎల్లగిరి స్టేజీ వద్ద దగ్ధమవుతున్న లారీ

కొయ్యలగూడెం(చౌటుప్పల్‌గ్రామీణం), న్యూస్‌టుడే: నడుస్తున్న లారీలో ఆకస్మాత్తుగా మంటలు చేలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారిపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన లారీ ఎన్‌సీఎల్‌ సిమెంట్‌ కంపెనీ నుంచి సిమెంట్‌ లోడుతో హైదరాబాద్‌కు వెళ్తుంది. జాతీయ రహదారిపై చౌటుప్పల్‌ మండలం ఎల్లగిరి స్టేజీ వద్దకు రాగానే మంటలు చేలరేగిన విషయాన్ని చోదకుడు ఎండీ గౌస్‌ గమనించారు. వెంటనే వాహనాన్ని రహదారి పక్కన నిలిపేసి ఆయన దిగిపోయారు. క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. భారీగా మంటలు ఎగిసిపడటంతో జాతీయరహదారిపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. చౌటుప్పల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ మేరకు వివరాలు నమోదు చేసుకున్నామని సంస్థ ప్రతినిధులు వస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని