కరోనాతో మరణించిన స్నేహితుని కుటుంబానికి చేయూత
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

కరోనాతో మరణించిన స్నేహితుని కుటుంబానికి చేయూత


రాజేశ్వరికి ప్లాట్‌ పత్రాలను అందజేస్తున్న సర్పంచి వేణుగోపాల్‌, శ్రీకాంత్‌ స్నేహితులు

చౌటుప్పల్‌గ్రామీణం,న్యూస్‌టుడే: కరోనాతో ప్రాణాలను వ్యక్తి కుటుంబానికి అతని స్నేహితులు అండగా నిలిచారు. చౌటుప్పల్‌ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన మామిండ్ల శ్రీకాంత్‌ (35) కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో అతని భార్య రాజేశ్వరి, మూడేళ్ల కుమార్తె, ఏడాది వయస్సు గల కుమారుడు ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ ఆర్థికస్థితి బాగలేకపోవడంతో శ్రీకాంత్‌ స్నేహితులు ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. స్నేహితులు గుర్రం ప్రమోద్‌ కుమార్‌, బుట్టి బాలరాజు, చౌట శివ, గంజి సురేశ్‌, దబ్బటి ఉపేందర్‌, దిల్లీ సురేందర్‌రెడ్డి, బొడపట్ల బాలరాజు, మల్లేశ్‌ కలిసి నేలపట్లలో రూ.ఐదు లక్షల విలువైన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశారు. స్థలాన్ని రాజేశ్వరితో పాటు ఆమె కుమార్తె ప్రిన్సి పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఆదివారం స్నేహితులు రిజిస్ట్రేషన్‌ ప్రతాలను రాజేశ్వరికి అందజేశారు. అలాగే శివాజీ కాలనీ వాసులు, గ్రామస్తులు కలిసి రూ.లక్ష నగదు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి చౌట వేణుగోపాల్‌గౌడ్‌, ఎంపీటీసీ సభ్యురాలు తడక పారిజాత, ఉసర్పంచి బుట్టి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు కొడెం రాములు, వార్డు సభ్యుడు గంజి లింగేశ్‌, రంగం అంబాలు, చౌట వేణుకుమార్‌, బుట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని