గైడింగ్‌తో యువతకు ఉపాధి
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

గైడింగ్‌తో యువతకు ఉపాధి


శిక్షణ పూర్తి చేసుకున్న గైడ్లతో పర్యాటక సంస్థ అధికారులు

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: టూర్‌ గైడింగ్‌ వల్ల యువతకు ఉపాధి కలుగుతుందని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. సాగర్‌ బుద్ధవనంలో నిర్వహిస్తున్న గైడ్‌ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఖచ్చితమైన సమాచారం, ఉచ్ఛారణ, చక్కటి వేషధారణ, ఆసక్తికరమైన కథనా నైపుణ్యం, బుద్ధవనంలో శిక్షణ పొందిన టూర్‌ గైడ్లు అలవర్చుకోవాలని సూచించారు. పర్యాటక సంస్థ ఎండీ మనోహర్‌ మాట్లాడుతూ టూర్‌ గైడ్లు సత్ప్రవర్తనతో మెలగాలని, పర్యాటకుల సమయం, ఆసక్తి మేరకు సమాచారం అందజేయాలని వివరించారు. శిక్షణ తరగతుల నిర్వహకుడు శివనాగిరెడ్డి, బుద్ధవనం ఓఎస్డీ సుధన్‌రెడ్డి, ఎస్‌ఈ క్రాంతిబాబు, బుద్ధవనం డిజైన్‌ ఇన్‌ఛార్జి శ్యాంసుదర్‌, ఏఈ జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న గైడ్లకు శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని