పల్లెగూడెంలో నూరు శాతం టీకాలు: కలెక్టర్‌
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

పల్లెగూడెంలో నూరు శాతం టీకాలు: కలెక్టర్‌


బీబీనగర్‌: పల్లెగూడెంలో కేక్‌ కోస్తున్న కలెక్టర్‌ పమేలా సత్పతి, తదితరులు

బీబీనగర్‌, న్యూస్‌టుడే: పల్లెగూడెం గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లాప్రజలందరూ కొవిడ్‌ నివారణ టీకా తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి కోరారు. మండలంలోని పల్లెగూడెం గ్రామంలో నూరుశాతం టీకాలు పంపిణీ పూర్తయిన సందర్భంగా గ్రామస్థులతో కలిసి కేక్‌ కోశారు. పల్లెగూడెంలో 381 మంది జనాభా ఉండగా.. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు 305 మంది ఉన్నారని, వారందరూ అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా టీకాలు వేయించుకోవడం అభినందనీయం అన్నారు. ఎంపీపీ ఎర్కల సుధాకర్‌గౌడ్‌, ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీవో స్వాతి, సర్పంచి భారతమ్మ, పంచాయతీ కార్యదర్శి అర్చన, వైద్యురాలు దాక్షాయణి, పాల్గొన్నారు.

ఆత్మకూరు(ఎం): వారం పాటు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న కొవిడ్‌ టీకాల పంపిణీ కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా అధికారులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఆరోగ్య ఉప కేంద్రాల్లో చేపట్టిన టీకాల పంపిణీని ఎంఎంవో డాక్టర్‌ ప్రణీషను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించి, పూడిపోయిన మరుగుదొడ్లు, మూత్రశాలల పైపులకు మరమ్మతులు పనులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్‌, ఎంపీడీవో ఎ.రాములు, ఎంపీవో జె.పద్మావతి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వీఆర్వో కనకయ్య ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని