ఉన్నట్టుండి.. కుప్పకూలిన వంతెన
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

ఉన్నట్టుండి.. కుప్పకూలిన వంతెన


నిడమనూరు మండలం బంకాపురం చిలుకల వాగులో పడిన ట్రాక్టర్‌ ట్రక్కు

ఉన్నట్టుండి ఓ వంతెన కుప్పకూలింది. ఆ సమయంలో వంతెనపై ఉన్న ట్రాక్టర్‌ ట్రక్కు వాగులో పడిపోయింది. ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. నిడమనూరు మండల కేంద్రం నుంచి బంకాపురం వెళ్లే దారిలో చిలుకల వాగు ఉంది. దానిపై చాలా ఏళ్ల క్రితం వంతెన నిర్మించారు. ఇటీవలి వర్షాలు, వరదలకు ఆ వంతెన దెబ్బతింది. ఈ క్రమంలో ఆదివారం బంకాపురం గ్రామానికి చెందిన బండారు చిన సైదయ్య తన ట్రాక్టర్‌లో టెంట్‌ సామగ్రి తీసుకురావడానికి నిడమనూరు వెళ్తూ వంతెన మీదకు రాగానే ఒక్కసారిగా పూర్తిగా కుప్పకూలిపోయింది. దీంతో ట్రాక్టర్‌ ట్రక్కు వాగులో పడి పోయింది. ఆ సమయంలో ట్రాక్టర్‌పై సైదయ్యతో పాటు మరో ఇద్దరూ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎవరికీ గాయాలు కాలేదు. వంతెన శిథిలావస్థకు చేరిందని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

- నిడమనూరు, న్యూస్‌టుడే


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని