ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కంచర్ల
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కంచర్ల


సమావేశంలో మాట్లాడుతున్న నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి 30 శాతం పీఆర్సీ అందించిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఆదివారం నల్గొండలోని లక్ష్మి గార్డెన్స్‌లో జరిగిన పీఆర్‌టీయూ టీఎస్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. పదవీ విరమణ వయస్సు పెంచామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పీఆర్‌టీయూ సంఘానికి తన సహకారం అందిస్తామని చెప్పారు. మాజీ ఎంఎల్‌సీ పూలరవీందర్‌ మాట్లాడారు. సమావేశంలో 2021-23గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా సుంకరి భిక్షంగౌడ్‌, ప్రధాన కార్యదర్శిగా కాళం నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో నల్గొండ మున్సిపల్‌ ఛైౖర్మన్‌ మందడి సైదిరెడ్డి, డీఈవో బి.భిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని