ప్రభుత్వ భూముల సర్వే
eenadu telugu news
Published : 20/09/2021 03:48 IST

ప్రభుత్వ భూముల సర్వే


ప్రభుత్వ భూముల సర్వే కోసం వెలిమినేడుకు చేరుకున్న సిబ్బంది

చిట్యాల, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల సర్వే మండలంలో ఆదివారం ప్రారంభమైంది. గ్రామాల వారీగా వివిధ రకాల ప్రభుత్వ భూములు దస్త్రాల ప్రకారంగా ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమిటి, ఆక్రమణలు ఉన్నాయా, అస్సైన్‌భూముల్లో అస్సైన్‌దారులు కబ్జాలో ఉన్నారా, వంటి పరిస్థితులపై సవివరమైన నివేదికను కోరిన నేపథ్యంలో భూమి కొలతలు, రెవెన్యూ సిబ్బంది ఉమ్మడిగా గతనెల రోజులుగా బెంచ్‌ వర్క్‌ను పూర్తిచేసుకున్నారు. క్షేత్రస్థాయిలో సర్వేను వెలిమినేడులో ప్రారంభించారు. కొంత పని పూర్తిచేశాక పలువురు గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తంచేశారు. సర్వేచేసి, ఇతర పరిశ్రమలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వారు సిబ్బందితో వాదించారు. కొంత పనిపూర్తి చేసుకొని సిబ్బంది వెనుదిరిగారు. ప్రజలు సందేహించాల్సింది ఇందులో ఏమీ లేదని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల స్థితిగతులను అక్షాంశాలు, రేఖాంశాలతో సహా గుర్తించేందుకు చేపట్టిన సర్వేలో భాగంగానే మండలంలో కూడా చేపట్టామని తహసీల్దారు ఎం.కృష్ణారెడ్డి పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని