కాటేసిన కరెంటు
eenadu telugu news
Published : 22/09/2021 02:26 IST

కాటేసిన కరెంటు

యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన సంఘటన మంగళవారం సాయంత్రం యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. యాదగిరిగుట్ట ఎస్సై-2 యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన ఎండీ హనిఫ్‌ (60) జీవనోపాధికి టాంగా కార్మికుడు. యాదగిరిగుట్టకు చెందిన పురపాలిక దుకాణ సముదాయంలో ఓ మడిగెను అద్దెకు తీసుకొని భార్యతో కలిసి కొబ్బరిబొండాలు అమ్మే వ్యాపారం సాగిస్తున్నారు. ఇటీవల దుకాణం గది గోడలకు కరెంటు షాక్‌ వస్తోంది. పక్కనే ఉన్న మరికొందరు దుకాణదారులూ అదే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పరిశీలించడానికి గది వెనుక భాగాన ఉన్న ఇనుప నిచ్చెన ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు, విద్యుత్తు సిబ్బంది అక్కడికి చేరుకొని విచారణ చేశారు. అతికి ఉన్న సర్వీస్‌ తీగలు చీలి దుకాణంపై కప్పు ఇనుప రేకులకు తాకడం, పైగా వర్షంతో తడిగా ఉండటం వల్ల విద్యుదాఘాతం సంభవించినట్లు డిస్కం అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని