నీటి నమూనాల సేకరణకు కలెక్టర్‌ ఆదేశం
eenadu telugu news
Published : 22/09/2021 02:26 IST

నీటి నమూనాల సేకరణకు కలెక్టర్‌ ఆదేశం

బీబీనగర్‌లో బోరు వద్ద నమూనాలు సేకరిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి

అధికారి రాజేందర్‌రెడ్డి, జియోలాజికల్‌ జిల్లా అధికారిణి స్వాతి, తదితరులు

బీబీనగర్‌, న్యూస్‌టుడే: బీబీనగర్‌లోని ఎంఎస్‌ఎన్‌ ఔషధ పరిశ్రమలో గ్యాస్‌ లీకై గ్రామస్ధులు ఇబ్బందులు పడ్డారని గత నెలలో గ్రామ యువజన సంఘాల నాయకులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్‌ పమేలా సత్పతి స్పందించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి, జియోలాజికల్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ఉమ్మడి నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ అధికారి రాజేందర్‌రెడ్డి, జియోలాజికల్‌ జిల్లా అధికారిణి స్వాతి మంగళవారం స్థానిక యువజన సంఘాల నాయకులతో కలిసి ఎంఎస్‌ఎన్‌ పరిశ్రమను సందర్శించారు. ఆ పరిశ్రమతోపాటు చుట్టుపక్కల బోర్లలో నీటి నమూనాలు సేకరించారు. నమూనాలను పరిశోధనశాలకు పంపి పరీక్షలు చేయిస్తామని వారు తెలిపారు. సంబంధిత అనుమతుల ధ్రువపత్రాలను వీలైనంత తొందరగా అందజేయాలని పరిశ్రమ అధికారులను కోరారు. ఆలస్యం చేసే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచి దస్తగిరి, బీబీనగర్‌ యువజన సంఘాల నాయకులు పొట్ట నవీన్‌, మొయిన్‌, నరేందర్‌, పృథ్వీ, శ్రీధర్‌, రెవెన్యూ అధికారులు రమేష్‌, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని