సమష్టి కృషితో మంచి ఫలితాలు
eenadu telugu news
Published : 22/09/2021 02:26 IST

సమష్టి కృషితో మంచి ఫలితాలు

బీబీనగర్‌ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో ఒప్పంద పత్రాలను చూపుతున్న డైరెక్టర్‌ భాటియా,

ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ డైరెక్టర్‌ జునారే, తదితరులు

బీబీనగర్‌, న్యూస్‌టుడే: సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధించవచ్చని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వికాస్‌ భాటియా అన్నారు. మంగళవారం బీబీనగర్‌ ఎయిమ్స్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.. ఎయిమ్స్‌ వైద్య విద్యార్థులు, అధ్యాపకుల పరిశోధనకుగాను నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం (గాంధీనగర్‌, గుజరాత్‌)తో మంగళవారం సమష్టి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు, అధ్యాపకులు (ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఆంత్రోపాలజీ, ఒడోంటాలజీ, టాక్సికాలజీ విభాగాల) పరిశోధనకు గాను గుజరాత్‌ యూనివర్సిటీకి వెళ్లవచ్చని, అక్కడి విద్యార్థులు, అధ్యాపకులు పరిశోధనకు ఇక్కడ రావొచ్చని ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు డైరెక్టర్‌ భాటియా తెలిపారు. రెండు విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అధ్యాపకులు సమన్వయంతో సమష్టి పరిశోధనలు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయ డైరెక్టర్‌ ఎస్వో జునారే, వైస్‌ ఛాన్స్‌లర్‌ వ్యాస్‌, వైద్య బృందం అబ్రహం జాన్సన్‌, పగ్నేష్‌పర్మార్‌, డాక్టర్‌ శ్యామల, కల్యాణి, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని