ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
eenadu telugu news
Published : 22/09/2021 02:26 IST

ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సర్వీసు రోడ్డు వంతెనపై నుంచి ప్రవహిస్తున్న చిన్నేటివాగు

బీబీనగర్‌, న్యూస్‌టుడే: బీబీనగర్‌ మండలంలో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షం కురిసింది. మండలంతోపాటు ఎగువన ఉన్న బొమ్మలరామారం, శామీర్‌పేట మండలాల్లో కురిసిన వర్షాలకు చిన్నేటి వాగు, హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు మూసీ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బీబీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో సర్వీసు రోడ్డు వంతెనపై నుంచి చిన్నేటి వాగు ప్రవహిస్తుండటంతో సర్వీసు రోడ్డు మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని గూడూరు- అన్నంపట్ల మధ్య, రావిపహాడ్‌తండా- భువనగిరి మండలంలోని అనాజీపురం మధ్య వంతెనల పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెల్లి శివారులో వంతెనకు ఆనుకొని మూసీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని