రూ.28 లక్షల నగదు చోరీ..?
eenadu telugu news
Published : 22/09/2021 02:26 IST

రూ.28 లక్షల నగదు చోరీ..?

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: తాళం వేసి ఉన్న ఇంట్లో పట్టపగలే దొంగలు చొరబడి రూ.28 లక్షలు చోరీ చేసిన ఘటన మంగళవారం సూర్యాపేటలో చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌లో నివాసం ఉండే గణేశ్‌ వినాయకుడి విగ్రహాల తయారీదారుడిగా జీవనం సాగిస్తున్నారు. ఇంటి స్థలం, ఇటీవల విగ్రహాలు విక్రయించగా వచ్చిన డబ్బులు మొత్తం రూ.28 లక్షలు బీరువాలో భద్రపర్చారు. మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి ఆరు బయట ఉన్న ముగ్గు డబ్బాలో తాళం చెవిని భద్రపర్చి దంపతులు విగ్రహాల తయారీ దుకాణానికి వెళ్లారు. పాఠశాలకు వెళ్లిన కుమారుడు సాయంత్రం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం తీసి ఉండడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వారు చేరుకొని బీరువాలో భద్రపర్చిన రూ.28 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చోరీపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఈ మేరకు విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని