కూలీలకు పనులు కల్పించాలి
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

కూలీలకు పనులు కల్పించాలి

సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ కోరారు. మంగళవారం డీఆర్‌డీవో కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి గ్రామంలో జాబ్‌ కార్డు కలిగిన కూలీలకు పనులు కల్పించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీల్లో 25 మందికి తక్కువ కాకుండా కూలీలు ఉపాధి హామీ పనికి హాజరయ్యేలా చూడాలన్నారు. రోజువారి సగటు వేతనం పెరిగేలా పనుల కొలతలపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే సంవత్సరం హరితహారంలో నాటుటకు అవసరమైన మొక్కలు పెంచేందుకు నర్సరీల్లో బెడ్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో పురోగతిలో ఉన్న అన్ని సేగ్రిగేషన్‌ షెడ్లు వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద ఖర్చు చేసిన డబ్బులకు యుసీలు వెంటనే సమర్పించాలన్నారు. జలశక్తి అభియాన్‌ పథకంలో భాగంగా సుమారు 24 వేల పనులు గుర్తించగా పూర్తి చేసిన పనులన్నింటిని వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం గిరి వికాస్‌ పథకంలో మంజూరు చేసిన యూనిట్లు వినియోగంలో ఉన్నాయా లేదా తనీఖీ చేయాలని ఆదేశించారు. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, డీఆర్‌డీవో కాళిందిని, డీపీవో విష్ణువర్థన్‌రెడ్డి, సీఈవో వీరబ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని