మండలానికి నాలుగు మినీ బృహత్‌ పల్లెప్రకృతి వనాలు: ఏపీడీ
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

మండలానికి నాలుగు మినీ బృహత్‌ పల్లెప్రకృతి వనాలు: ఏపీడీ

విభళాపురంలో మెగా బృహత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటు స్థలాన్ని పరిశీలిస్తున్న ఏపీడీ రాజు

మోతె, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా మండలాల్లో నాలుగేసి మినీ బృహత్‌ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డీఆర్‌డీవో సూర్యాపేట క్లస్టర్‌ ఏపీడీ రాజు అన్నారు. విభళాపురంలో పదెకరాల్లో నిర్మిస్తున్న మెగా బృహత్‌ పల్లెప్రకృతి వనం పనులను మంగళవారం పరిశీలించారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో భూమి లభ్యతనుబట్టి ఐదు నుంచి ఏడెకరాల విస్తీర్ణంలో ఈ మినీ పల్లెప్రకృతి వనాలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. బహుళ వరుసల్లో మొక్కలు నాటడానికి రహదారులను గుర్తిస్తున్నట్లు చెప్పారు. మెగా పల్లెప్రకృతి వనం ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. సర్పంచి వీరస్వామి, ఎంపీడీవో శంకర్‌రెడ్డి, ఏపీవో వెంకన్న, ఈసీ శ్రీనివాస్‌, టీఏ ఉమ్లానాయక్‌ పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని