ఒకే రకమైన యూనిట్ల ను ఎంచుకోవద్దు: కలెక్టర్‌
eenadu telugu news
Published : 22/09/2021 02:40 IST

ఒకే రకమైన యూనిట్ల ను ఎంచుకోవద్దు: కలెక్టర్‌

తాటిపాములలో దళిత బంధు పథకంపై అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

తిరుమలగిరి, న్యూస్‌టుడే: దళిత బంధు లబ్ధిదారులందరు ఒకే రకమైన యూనిట్లను ఎంచుకోవద్దని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. తాటిపాముల, తొండ గ్రామాల్లో, తిరుమలగిరి పురపాలికలోని 5, 6 వార్డుల్లో మంగళవారం ‘దళిత బంధు’ పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఎక్కువ మంది ఒకే రకమైన యూనిట్‌ నిర్ణయించుకోవడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందలేరని చెప్పారు. పథకం పొందేందుకు కార్యాలయాల చూట్టూ తిరగొద్దని, ఎవరిని ఆశ్రయించొద్దని తెలిపారు. అధికారులు ప్రతి ఒక్క లబ్ధిదారుని వద్దకు వచ్చి అవగాహన కల్పిస్తారని చెప్పారు. పథకంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వివరించారు. అనంతరం పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ జిల్లా అధికారి శీరీష, పురపాలిక ఛైర్‌ పర్సన్‌ పోతరాజు రజని, కమిషనర్‌ డి.శ్రీనివాస్‌ ఎంపీడీవో కె. ఉమేశ్‌, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని