గాయత్రికి నగదు సాయం
eenadu telugu news
Published : 15/10/2021 05:39 IST

గాయత్రికి నగదు సాయం

గాయత్రికి నగదు అందజేస్తున్న టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌నేత

చండూరు, న్యూస్‌టుడే: చండూరుకు చెందిన దోనాల గాయత్రి అనే యువతి కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. గత నెల 23న ‘మాత్రలు వేసుకుంటేనే మనుగడ’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పున్న కైలాష్‌నేత గురువారం చండూరుకు వచ్చి గాయత్రిని కలిశారు. ఆమెకు వచ్చిన వ్యాధి, పడుతున్న బాధలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం చేశానని, ఆమె చదువుకు, చికిత్సకు తన వంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు. గాయత్రిని ఆదుకోవటానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు కురుపాటి గణేశ్‌, ఇరిగి వెంకటేశ్వర్లు, పన్నాల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని