న్యాయస్థానంపై నమ్మకం పెంచేందుకు కృషి
eenadu telugu news
Published : 19/10/2021 05:00 IST

న్యాయస్థానంపై నమ్మకం పెంచేందుకు కృషి

చౌటుప్పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగరాజు

మాట్లాడుతున్న జడ్జి నాగరాజు

చౌటుప్పల్‌, న్యూస్‌టుడే: కేసులను త్వరితగతిన పరిష్కరించి న్యాయస్థానంపై గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచేందుకు కృషి చేస్తానని చౌటుప్పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.నాగరాజు తెలిపారు. స్థానిక జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తిగా సోమవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. చౌటుప్పల్‌ న్యాయస్థానానికి తొలి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనను ఏసీపీ ఉదయ్‌రెడ్డి, గ్రామీణ సీఐ ఏరుకొండ వెంకటయ్య, ఎస్సై మానస పుష్పగుచ్ఛం అందించారు. పురపాలిక ఛైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పెద్దిటి బుచ్చిరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎలమోని శ్రీనివాస్‌, కార్యదర్శి బాల్యం వెంకటాచలపతి, న్యాయవాదులు అభినందనలు తెలిపి స్వాగతించారు. న్యాయమూర్తి నాగరాజు మాట్లాడుతూ, వ్యక్తికన్నా వ్యవస్థ గొప్పదని, న్యాయవ్యవస్థను పటిష్ఠంగా ఉంచాలన్నారు. తామరాకుపై నీటి బొట్టులా వ్యవహరిస్తూ చట్టప్రకారం న్యాయం జరిగేందుకు సమష్ఠిగా కృషి చేయాలని పేర్కొన్నారు. న్యాయవాదులు తమ పరిజ్ఞానాన్ని పెంచుకొనేందుకు నిత్యం గ్రంథాలను అధ్యయనం చేయాలన్నారు. బార్‌ అసోసియేషన్‌ హాలులో గ్రంథాలయం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కోర్టు హాలు యుద్ధక్షేత్రం లాంటిదని, అక్కడికి వచ్చిన న్యాయవాదులు సర్వ సన్నద్ధులై రావాలన్నారు. కత్తి మర్చిపోయానంటే హాస్యాస్పదంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. తాను ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడానికి వచ్చానని తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్నోయేళ్లపాటు కృషి చేసి సాధించుకున్న ఈ న్యాయస్థానాన్ని రాష్ట్ర స్థాయిలో ముందుంచేందుకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించారు.

బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు  
భువనగిరి నేరవిభాగం: బదిలీపై వచ్చిన భువనగిరి ప్రధాన ప్రథమ శ్రేణి న్యాయమూర్తి నాగేశ్వరరావు, అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి కవిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోద వెంకటేశ్వర్లు అధ్యక్షతన న్యాయమూర్తుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులకు ఐదో అదనపు జిల్లా న్యాయమూర్తి హుజైబ్‌ అహ్మద్‌ఖాన్‌ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బార్‌ కార్యవర్గ సభ్యుడు గడీల నవీన్‌కుమార్‌, సుర్కంటి జంగారెడ్డి, పీపీ నరేంద్రప్రసాద్‌, ఏజీపీలు నాగారం అంజయ్య, ఆకుల ఆంజనేయలు, జీపీ వంగేటి విజయ్‌భాస్కర్‌రెడ్డి, న్యాయవాదులు జి.శ్రీనివాన్‌రెడ్డి, వి.దామోదర్‌రెడ్డి, ఏం.ఏ.రహీం, ఎస్‌.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని