చెట్లపొదల్లో పసిపాప
eenadu telugu news
Published : 19/10/2021 05:51 IST

చెట్లపొదల్లో పసిపాప

పొదల్లో లభించిన పసికందు

చింతలపాలెం, న్యూస్‌టుడే: కళ్లు తెరవని పసిపాప అని కూడా చూడకుండా గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు వెంట పొదల్లో వదిలి వెళ్లిన ఘటన మండలంలోని వజినేపల్లి సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పులిచింతల ప్రాజెక్టు నుంచి వజినేపల్లికి వెళ్లే దారిలో రోడ్డు వెంట ఉన్న చెట్ల పొదల్లో పసిపాప ఏడుపు వినిపించింది. గమనించిన స్థానికులు కొందరు ఆశా కార్యకర్త భూలక్ష్మీ, ఏఎన్‌ఎమ్‌ కళ్యాణికి సమాచారమిచ్చారు. వారు విషయాన్ని ఐసిడీఎస్‌ అధికారులకు చేరవేయడంతో కోదాడ సీడీపీవో అనంతలక్ష్మీ ఘటనా స్థలానికి చేరుకుని పసికందుని స్వాధీనం చేసుకుని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు శిశువు వీపు భాగంలో చీమలు పట్టి స్వల్ప ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం పాప సురక్షితంగా ఉన్నట్లు సీడీపీవో తెలిపారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని