నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి: ఎంపీ
eenadu telugu news
Published : 19/10/2021 06:03 IST

నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి: ఎంపీ

తాటికల్‌లో యువకులతో మాట్లాడుతున్న ఎంపీ కోమటిరెడ్డి, దైద రవీందర్‌

నకిరేకల్‌, న్యూస్‌టుడే: ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. సోమవారం నల్గొండ నుంచి తాటికల్‌ మీదుగా కట్టంగూరు, నార్కట్‌పల్లి వెళ్తున్న ఆయన తాటికల్‌ గ్రామంలో కొద్దిసేపు స్థానిక యువకులతో మాట్లాడారు. కేసీఆర్‌ను గద్దె దించితేనే యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఏడేళ్ల నుంచి అసంపూర్తిగా ఉన్న నకిరేకల్‌- తాటికల్‌- నల్గొండ 565 నంబర్‌ జాతీయ రహదారి పనుల పునరుద్ధరణకు పార్లమెంట్‌లో పోరాడి నిధులు సాధించేందుకు కృషి చేశానని ఎంపీ చెప్పారు. టీపీసీసీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్‌, నాయకులు పన్నాల రాఘవరెడ్డి, పొల్లెగోని వెంకటేశ్వర్లు, పి.జ్యోతిబసు, దుర్గయ్య, బాలకృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని