వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోండి
eenadu telugu news
Published : 19/10/2021 06:03 IST

వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోండి

సూర్యాపేట: ఫిర్యాదుదారుతో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: వివాదాలను ప్రజలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివస్‌ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక విభాగం పనిచేస్తుందని చెప్పారు. గ్రీవెన్సు డేలో పదకొండు ఫిర్యాదులు అందగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు: డీవీఎం
కుడకుడరోడ్డు(సూర్యాపేట), న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్టాండ్‌లోని స్టాళ్లలో వస్తువులు, తినుబండారాలను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీవీఎం జి.కేశవులు అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఆదేశాల మేరకు సూర్యాపేటలోని హైటెక్‌ బస్టాండులో మంగళవారం తనిఖీ నిర్వహించారు. స్టాల్‌ నంబర్‌-1, 19లో అధిక ధరకు విక్రయించిన యజమానులకు రూ.1,000 చొప్పున జరిమానా విధించారు. డీఎం శివరామకృష్ణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎం.వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని