చిత్ర వార్తలు
eenadu telugu news
Published : 24/10/2021 05:03 IST

చిత్ర వార్తలు

ఇలా.. వెళ్లేదెలా..?

ల్గొండ జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు గల కొండమల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఎదుట పరిస్థితి ఇది. సుమారు 1100 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్న ఈ పాఠశాల సమీపంలో మురుగు కాల్వలు సరిగ్గా లేవు. దీంతో ఆ నీరంతా రోడ్డుపై పారుతుండగా రాకపోకలకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

- కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే


మారింది క్షేత్రం.. జ్ఞాపకాలు పదిలం

నాడు

నేడు

డేళ్ల క్రితం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం, నేడు యాదాద్రిగా నామకరణంతో పునర్నిర్మితమైన క్షేత్రానికి సంబంధించి డ్రోన్‌ కెమోరాతో తీసిన చిత్రం సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతూ ఆకట్టుకుంటోంది. పూర్తిగా రూపురేఖలు మారిన యాదగిరిగుట్ట దేవస్థానం చూసి ఎంతటి మార్పు అని ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. మరికొందరు గత మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు.

- యాదగిరిగుట్ట పట్టణం, న్యూస్‌టుడే


రాజసం.. జిల్లా పోలీస్‌ కార్యాలయం

కొనసాగుతున్న జిల్లా పోలీసు కార్యాలయం నిర్మాణ పనులు

సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాజసం ఉట్టి పడేలా కార్యాలయానికి నిర్మించిన పెద్ద డోమ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇప్పటికి మూడు అంతస్తుల్లో స్లాబులు పూర్తయ్యాయి. విభాగాల గదుల నిర్మాణం చేస్తున్నారు. మరో నాలుగు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు. 

- ఈనాడు సూర్యాపేట.


కుందనపు బొమ్మల్లా కూడళ్లు

వైకుంఠ ద్వారం చెంత పచ్చని కూడలి

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం చుట్టూ నిర్మిస్తున్న వలయ రహదారిలో కూడళ్లను కుందనపు బొమ్మళ్ల తయారు చేస్తున్నారు. ఈ అధ్మాత్మిక క్షేత్రంలో శిల్పకళారూపాలతోపాటు పచ్చదనానికి పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వైకుంఠద్వారం చెంత, ప్రెసిడెన్షియల్‌ సూట్‌, గండి చెరువు కూడళ్లలో 30 మీటర్ల వైశాల్యంతో వివిధ రకాల పుల మొక్కలను వృత్తాకారంలో అందంగా పేర్చి పెంచుతున్నారు. ఈ మొక్కలకు పూలు వికసించాక వివిధ రంగుల్లో వలయాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.

ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ వద్ద అందంగా కనిపిస్తున్న కూడలి

-ఈనాడు, యాదాద్రి భువనగిరి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని